ఎన్డీఏ యేతర కూటమి బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో దిల్లీలో భేటీ అయ్యారు. గంటపాటు కాంగ్రెస్ అధ్యక్షుడితో సమావేశమైన చంద్రబాబు... వివిధ పార్టీల అభిప్రాయాలు, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఎల్‌జేడీ నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో విడివిడిగా భేటీ అయిన బాబు... పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మధ్యాహ్నం చంద్రబాబు బృందం లఖ్‌నవూ వెళ్లనుంది. సాయంత్రం 6గంటలకు మాయావతితో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అఖిలేశ్ తోనూ భేటీ కానున్నారు.
అంతకుముందు...
ఇప్పటికే ఏపీ భవన్లో సురవరం సుధాకర్ రెడ్డి, డీ.రాజాతో సీఎం భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు...ఆ తర్వాత అనుసరించిన వ్యూహాలపై చర్చించారు.
భాజపాయేతర నేతలతో సీఎం భేటీ.. 'కూటమి' బలోపేతంపై చర్చ
ఎన్డీఏయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా రాహుల్, శరద్ యాదవ్ లతో సమావేశమయ్యారు. మరికొంత మంది ముఖ్య నేతలతో సీఎం భేటీ కానున్నారు.