రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. ప్రకటనలకే పరిమితం అయిందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ మాట నమ్మి నెల రోజులుగా ధాన్యం పొలాల దగ్గర పెట్టుకొని రైతులు ఎదురు చూస్తున్నారని ధ్వజమెత్తారు. రోజులు గడిచేకొద్దీ ధాన్యం నాణ్యత కోల్పోతే అప్పుడు ప్రభుత్వం వంకలు పెట్టి గిట్టుబాటు ధరకు ఎసరు పెడతుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం చేసే ఇలాంటి పనుల వల్లే రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రైతుల నుంచి ధాన్యం తక్షణమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి చెల్లింపులు కూడా వెంటనే జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు చేసే తీరిక ప్రభుత్వానికి లేదా?: చంద్రబాబు - ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వంపై చంద్రబాబు కామెంట్స్
ప్రతీకారాలతో రగిలిపోతూ ఏసీబీ కేసులు వేసే తీరిక ఉంది కానీ... రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే తీరిక ప్రభుత్వానికి లేదా? అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సంగం మండల కేంద్రంలో ధాన్యం పండించిన రైతులు రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చిందని నిలదీశారు.