తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆపార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ తమ తమ నివాసాల వద్దే కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన నివాసం వద్ద నిరసన తెలిపారు.
పదకొండు ఆరోపణలు, పదకొండు కేసుల్లో ఏ1గా ముద్దాయిగా ఉన్న జగన్ పై ఎర్రనాయుడి కేసు వేశాడనే అక్కసుతోనే ఇప్పుడు కక్ష తీర్చుకుంటారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అవినీతిని శాసనసభలో నిలదీస్తున్నారని, వెనుకబడిన వర్గాల తరపున పోరాడుతున్న కారణంగానే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఏదో విధంగా దెబ్బతీయాలి అనే దురుద్దేశంతోనే అచ్చెన్నను అరెస్టు చేశారన్నారు.
అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని బలవంతంగా ఎక్కించుకుని.. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించి మరి ఆయన పట్ల దారుణంగా ప్రవర్తించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో పక్క జేసీ ప్రభాకర్ రెడ్డి శస్త్రచికిత్స చేసుకుంటే.... రాత్రికి రాత్రికే అరెస్ట్ చేసి తీసుకుపోయారని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షలకు అంటూ ఒక హద్దుంటూ ఉంటుందన్నారు.
ఇవీ చదవండి: