ETV Bharat / city

'వైకాపా నేతల అక్రమార్జనకు.. ఇసుక ఆదాయ వనరు' - చంద్రబాబు దీక్ష న్యూస్

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శల దాడి చేశారు. స్పందనలో వినతులు ఇచ్చిన చేతులతోనే పురుగుల మందు తాగే దుస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

chandrababu comments on ycp govt
author img

By

Published : Nov 12, 2019, 5:13 PM IST

వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు

స్పందనలో వినతులు ఇచ్చిన చేతులతోనే ప్రజలకు పురుగుల మందు తాగే దుస్థితిని.. ప్రభుత్వం కల్పిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎమ్మార్వో.. ఎంపీడీవో కార్యాలయాలకు పెట్రోల్‌ సీసాలతో వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. వైకాపా వేధింపులు భరించలేకే ఆవేదనతో జనం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన... వైకాపా నేతలు తమ అక్రమార్జనకు ఇసుకను ఆదాయ వనరుగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14న తాము చేపట్టబోయే దీక్షతో వైకాపా సర్కారుకు కనువిప్పు కలగాలని హితవు పలికారు. పేదల కడుపు కొట్టి వైకాపా కార్యకర్తల పొట్టలు నింపుతున్నారని మండిపడ్డారు. వీవోఏల జీతాలు ఒక చేత్తో పెంచుతూనే మరో చేత్తో వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

గవర్నర్​తో జనసేన అధ్యక్షుడు పవన్ భేటీ.. జోక్యం చేసుకోవాలని వినతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.