ETV Bharat / city

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ప్రాణాలు తీస్తారా?: చంద్రబాబు

రాష్ట్రంలో ఎప్పుడూ లేని పాలన చూస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కడప జిల్లా తెదేపా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..సుబ్బయ్య హత్య నిందితులపై కఠిన చర్యలు చేపట్టేదాకా రాజీలేని పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ప్రాణాలు తీస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ప్రాణాలు తీస్తారా?

author img

By

Published : Dec 29, 2020, 6:30 PM IST

రాష్ట్రంలో ముందెన్నడూ లేని దుర్మార్గ, కిరాతక, ఉన్మాద పాలన చూస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని బీసీ నాయకుడు నందం సుబ్బయ్య ప్రాణాలు తీస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కడప జిల్లా తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... వైకాపా అవినీతి కుంభకోణాలను బయటపెట్టడం సుబ్బయ్య చేసిన నేరమా ? అని ప్రశ్నించారు.

"ఇళ్ల పట్టాల పంపిణీలో వైకాపా అవినీతిని నందం సుబ్బయ్య బయటపెట్టాడు. సుబ్బయ్యను ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు పిలిపించి హత మార్చడం కిరాతకం. అవినీతికి పాల్పడిన వాళ్లను, మట్కా దందాలు చేసేవాళ్లను వదిలేశారు. వాటిని బయటపెట్టిన వారిని చంపేస్తారా?. రాష్ట్రాన్ని జగన్‌ జంగిల్ రాజ్‌గా మారుస్తారా?. నేరస్థులపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే నేరాలు-ఘోరాలు పెచ్చుమీరాయి. తామేం నేరం చేసినా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఉన్మాదులంతా పేట్రేగి పోతున్నారు. కమిషనర్ కబురు చేసి పిలిపించారని, ఆయన కళ్లెదుటే చంపారనే విషయంపై మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలి. సుబ్బయ్య హత్య వెనుక కుట్ర కోణాన్ని బహిర్గతం చేయాలి."- చంద్రబాబు

సుబ్బయ్య హత్య నిందితులపై కఠిన చర్యలు చేపట్టేదాకా రాజీలేని పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. వైకాపా హత్యా రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనపై ధైర్యంగా పోరాడాలన్నారు.

ఇదీచదవండి

పోస్టుల వివాదం.. తెదేపా నేత దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.