చిత్తూరు జిల్లా అమర్‌రాజా ఇన్ఫ్రాటెక్‌కు కేటాయించిన భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌పై అక్కసుతోనే భూములు వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధిక పన్ను చెల్లించే పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్ర నాయుడని..., అమర్‌రాజా కంపెనీల ద్వారా 16 వేల మందికి ఉపాధి కల్పించారని చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలకు కూడా వైకాపా మోకాలడ్డటం గర్హనీయమన్నారు.
కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే.. 250 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేశారని చంద్రబాబు అన్నారు. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టనివాళ్లను వదిలేశారని మండిపడ్డారు. వైకాపా హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు తిరోగమనంలో ఉన్నాయని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: అమర్‌రాజా ఇన్ఫ్రాటెక్‌కు కేటాయించిన భూములు వెనక్కు తీసుకుంటున్న ప్రభుత్వం