ETV Bharat / city

CBN and lokesh fires on govt: కోన వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు - తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్న చంద్రబాబు

CBN and lokesh fires on govt: శ్రీకాకుళం జిల్లాలో తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది ప్రభుత్వ హత్యేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్​.. రాష్ట్రంలో ఉన్నది పోలీసులా, వైకాపా నాయకుల అనుచరులా అని ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో.. అధికార పార్టీని ప్రశ్నించినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపించారు.

Chandrababu and lokesh fires on govt over TDP follower suicide in srikakulam
తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే
author img

By

Published : Mar 8, 2022, 12:13 PM IST

Updated : Mar 8, 2022, 3:26 PM IST

CBN and lokesh fires on govt: శ్రీకాకుళం జిల్లా పొత్తంగి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు వేధించడం వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకే వేధించి ప్రాణాలు తీశారన్నారు. మృతుడి కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • వెంకట్రావు మృతికి కారణం అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసుల పైన కేసు నమోదు చెయ్యాలి. వెంకట్రావు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.(2/2)

    — N Chandrababu Naidu (@ncbn) March 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో ఉన్నది పోలీసులా ?, వైకాపా నాయకుల అనుచరులా ?

పోలీసుల వైఖరి చూస్తే.. రాష్ట్రంలో ఉన్నది పోలీసులా ?, వైకాపా నాయకుల అనుచరులా ? అనే అనుమానం వస్తోందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైకాపా అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిని ఇలా చంపుకుంటూ పోతే.. రాష్ట్రంలో వైకాపా నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారన్నారు. కోన వెంకట్రావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

  • ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారు.(2/4)

    — Lokesh Nara (@naralokesh) March 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • సోషల్ మీడియా పోస్ట్ ల పేరుతో టిడిపి కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలి. చట్టాలని గౌరవిస్తున్నామని ...పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదు.(4/4)

వైఫల్యాలు ఎత్తిచూపినందుకే..

వైకాపా గూండాలే వెంకట్రావును పొట్టన బెట్టుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేధింపులవల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎత్తిచూపినందుకే వేధింపులకు గురిచేశారన్నారు. మహిళా దినోత్సవం రోజున వైకాపా నేతలు ఒక మహిళ మంగళసూత్రాన్ని తెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులైన వైకాపా నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వెంకట్రావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

సంబంధిత కథనం:

Suicide: తెదేపా కార్యకర్త ఆత్మహత్య... పోలీసుల వేధింపులేనా..!

Last Updated : Mar 8, 2022, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.