ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. ఆయన మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. విచారం వ్యక్తం (chandrababu and lokesh condolences to shivashankar master) చేశారు.
సినీపరిశ్రమ కళామతల్లి ముద్దు బిడ్డను కోల్పోయిందని.. శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరమని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శివశంకర్ మాస్టర్ తన నృత్యం, నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారని కొనియాడారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో నృత్యరీతులు సమకూర్చారని చెప్పారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేయడమే కాకుండా.. సుమారు 30 చిత్రాల్లో నటించారని గుర్తుచేశారు. 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకోవడం గర్వకారణమని అన్నారు. శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.
-
ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.(2/2)
— Lokesh Nara (@naralokesh) November 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.(2/2)
— Lokesh Nara (@naralokesh) November 28, 2021ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.(2/2)
— Lokesh Nara (@naralokesh) November 28, 2021
శివశంకర్ మాస్టర్ మృతి పట్ల.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణాది చిత్రసీమలో ఎన్నో చిత్రాలకు నృత్యరీతుల్ని సమకూర్చి.. లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకున్నారని అన్నారు. డ్యాన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి మాస్టర్ మరణం.. చిత్రపరిశ్రమకి తీరని లోటని లోకేష్ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి: