గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్ముడిని తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్మరించుకున్నారు. వైకాపా పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. కక్షలు, కబ్జాలు, ఆక్రమణలతో పల్లెలు అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అహింస, సత్యాలతో విజయం సాధించిన మహనీయుడు గాంధీజీ అని నారా లోకేశ్ అన్నారు. హింసా రాజకీయాలను నమ్ముకున్నవారు ఏం సాధించినా తాత్కాలికమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: