కరోనా భయంతో ధర్మవరంలో దంపతుల ఆత్మహత్య, ఇంట్లో వాళ్లు రానీయడం లేదని విజయవాడలో ఆసుపత్రి పైనుంచి దూకి మరొకరు మరణించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. పొక్లెయిన్లతో మృతదేహాల తరలింపు, చెత్త తరలించే వాహనాల్లో కరోనా బాధితులను తీసుకెళ్లడం లాంటి సంఘటనలు కలచి వేస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమన్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వం రాజకీయ విన్యాసాలతో పైశాచిక ఆనందం పొందుతుందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు