'రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాస్తున్నారు' - చంద్రబాబు తాజా వార్తలు
స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణకు అడ్డు వస్తే సినీ హీరో రామ్‌కు సైతం నోటీసులు ఇస్తామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు చేసిన వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

chandra babu
టాలీవుడ్ హీరో పోతినేని రామ్‌పై విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు చేసిన వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హీరో రామ్‌కు నోటీసులు ఇస్తామని బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏ విధంగా కాలరాస్తున్నారో చెప్పేందుకు ఇది మరో రుజువు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు. ప్రశ్నించే గొంతును అణచిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ - చంద్రబాబు, తెదేపా అధినేత