చిరంజీవికి తెదేపా అధినేత ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు... అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించారని కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని లోకేష్ అన్నారు. చిరంజీవి ఇంటిల్లిపాదికీ వినోదాన్ని అందించే విభిన్నపాత్రలలో నటించి ప్రేక్షకహృదయాలలో చెరగని స్థానాన్ని పదిలం చేసుకున్నారని కొనియాడారు.
ఇదీ చదవండి