వైఎస్ హయాం నాటి నాసిరకం పనుల వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. అప్పులు చేసి స్కామ్‌లు చేసే స్కీమ్‌లకు నిధులు మళ్లించారని ధ్వజమెత్తారు. టీడీఎల్పీ, పార్టీ ముఖ్యనేతలతో అయన వర్చువల్ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షనర్లు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమా బెయిల్‌పై విడుదలై బయటకు వస్తే.. చట్టవిరుద్ధంగా జాతీయ రహదారిని బ్లాక్ చేశారన్నారు.
పోలవరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని చంద్రబాబు వెల్లడించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. విశాఖలో బాక్సైట్ మైనింగ్‌తో వేలాది కోట్లు దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు భయపడి పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేశారన్న చంద్రబాబు... రూ.2 లక్షల కోట్ల సంపదను నిరుపయోగ ఆస్తిగా మార్చారని మండిపడ్డారు. అమరావతి పోరాటానికి 600 రోజులు పూర్తవుతోందన్న ఆయన వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు.
ఇదీ చదవండి