CENTRAL TEAM AT AP: గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన, తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రతినిధుల బృందం ఏపీవ్యాప్తంగా పర్యటించింది. రాష్ట్రంలో కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పనితీరును క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. కేంద్ర గ్రామీణ ఆభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన కామన్ రివ్యూ మిషన్ ప్రతినిధులు, తదితర నిపుణులతో కూడిన బృందం.. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరును పర్యవేక్షించింది. అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులతో బృందం భేటీ అయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామ పంచాయితీల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపి లబ్దిదారుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు బృందం వెల్లడించింది. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల పట్ల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నట్టు స్పష్టం చేసింది. వీటిపై నివేదిక రుపొందించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు బృందం వెల్లడించింది.
మరోవైపు ఏపీలో ఉపాధి హామీ పనిదినాలను 150 రోజులకు పెంచడంతోపాటు వేసవి భత్యానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు విన్నవించారు. పారిశుధ్ధ్య కార్యక్రమాలకు కూడా ఉపాధి హామీ నిధుల వినియోగానికి సిఫార్సు చేయాల్సిందిగా బృందానికి కోరారు.
ఇదీ చదవండి:
Minister Kannababu on Oil palm : ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ప్రణాళికలు - మంత్రి కన్నబాబు