Central Power agency warns transco: పరిమితికి మించి ఏపీ సెంట్రల్ గ్రిడ్ నుంచి విద్యుత్ వాడుకోవడంతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని.. పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ అభిప్రాయపడింది. అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్తును తీసుకోవడం వల్ల గ్రిడ్ ఫ్రీక్వెన్సీకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్కోకు పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లేఖ రాసింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరగటంతో రోజుకి 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీంతో దక్షిణాది రీజన్ గ్రిడ్ నుంచి డిస్కంలు విద్యుత్ తీసుకుంటున్నాయి. ప్రస్తుతం పిక్ డిమాండ్ 11 వేల 895 మెగావాట్లకు చేరింది. ఈనెల 22న దాదాపు 900 మెగావాట్ల విద్యుత్‌ను డిస్కంలు అధికంగా తీసుకున్నట్టు ట్రాన్స్‌కోకి పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లేఖ రాసింది.
అధికంగా విద్యుత్ తీసుకోవడం కారణంగా గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.5కు పడిపోయిందని.. ఇది ప్రమాదకరమని పేర్కొంది. ఏప్రిల్ నుంచి దక్షిణాదిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో ఉంటుందని.. ఇది 62 వేల 400 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జెన్కో స్టేషన్లలో బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలని ట్రాన్స్కోకు.. పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ సూచించింది.
రాష్ట్రంలో గరిష్ఠ స్థాయికి విద్యుత్ వినియోగం.. యూనిట్ ధర రూ.20