ETV Bharat / city

Central Minister Pawar: 'నిధులిస్తున్నాం కదా.. మోదీ ఫొటో ఏది..?' - కేంద్రమంత్రి పవార్ తాజా వార్తలు

విజయవాడ ప్రభుత్వాస్పత్రిని కేంద్ర సహాయ మంత్రి డా.భారతి ప్రవీణ్‌ పవార్‌ సందర్శించారు. ఆరోగ్యశ్రీ కార్డుపై మోదీ ఫొటో లేకపోవడంపై ఆమె సిబ్బందిని ప్రశ్నించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా నిధులిస్తున్నా.. ఫొటో ఎందుకు లేదని సిబ్బందిని నిలదీశారు.

'నిధులిస్తున్నాం కదా.. మోదీ ఫోటో ఎందుకు లేదు'

author img

By

Published : Jun 10, 2022, 9:16 PM IST

ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవటాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్‌ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చిత్రపటం మినహా ప్రధాని ఫొటో లేకపోవడంతో ఈ పథకానికి నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే విషయం తెలుసా ? అని నిలదీశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి.. ఆరోగ్య మిత్ర సిబ్బందితో మాట్లాడారు.

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులున్న వారికి అందిస్తోన్న వైద్య సేవల గురించి ప్రత్యేకంగా వివరాలు నమోదు చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో బ్లడ్‌ బ్యాంకును పరిశీలించారు. టెలీమెడిసిన్‌ సేవల గురించి ఆరా తీశారు. ఓ రోగితో నేరుగా టెలీమెడిసిన్‌ సౌకర్యంలో భాగంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిద్ధార్ధ మెడికల్‌ కళాశాలను మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తోన్న నిధులతో ఏయే వసతులు కల్పించారనే వివరాలపై ఆరా తీశారు.

ఇవీ చూడండి

పక్షిని కాపాడేందుకు వెళ్లి ఇద్దరు మృతి.. లైవ్​ వీడియో !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.