Nithin Gadkari to visit AP: రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్తగా మంజూరైన వాటికి భూమిపూజలను విజయవాడలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం జగన్ చేతుల మీదుగా గురువారం నిర్వహించనున్నారు. విజయవాడలోని బెంజ్‌సర్కిల్ వద్ద రెండో వంతెన ప్రారంభం అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులకు చెందిన రూ.21,559 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. వీటిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి చెందినవి రూ.13,806 కోట్ల విలువైన ప్రాజెక్టులు కాగా, రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్)కు చెందినవి రూ.7,753 కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కీలకమైనవి...
భూమిపూజలు చేసేవి
* ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని రేచర్ల-గురవాయిగూడెం-దేవరపల్లి మధ్య రెండు ప్యాకేజీల్లో 56.89 కి.మీ. మేర రూ.1,281 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం.
* బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఏపీ, తమిళనాడులో చిత్తూరు-తట్చూరు హైవే కింద వరదరాజుల- కూమరరాజపేట-వీరకావేరిరాజపురం-పొందవక్కం మధ్య మూడు ప్యాకేజీల్లో 96.04 కి.మీ. మేర రూ.3,178 కోట్లతో ఆరు వరుసల రహదారి నిర్మాణం.
* ఏజెన్సీ ప్రాంతం మీదుగా వెళ్లే.. రాజమహేంద్రవరం-విజయనగరం జాతీయ రహదారిలో కొయ్యూరు-చాపరాతిపాలెం(45.5 కి.మీ.), చాపరాతిపాలెం-లంబసింగి (39.5 కి.మీ.), లంబసింగి-పాడేరు (49.58 కి.మీ.) మూడు ప్యాకేజీలు కలిపి రూ.1,021 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ తదితరాలు.
ప్రారంభోత్సవాలు జరిగేవి
* పశ్చిమగోదావరిలోని గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు 70 కి.మీ. మేర రూ.2,676 కోట్లతో నిర్మించిన నాలుగు వరుసల రహదారి.
* చిత్తూరు-మల్లవరం మధ్య 61.13 కి.మీ. మేర రూ.2,330 కోట్లతో నిర్మించిన ఆరు వరుసల రహదారి.
* నరసన్నపేట-రణస్థలం మధ్య 50 కి.మీ. రూ.1,457 కోట్లతో ఆరు వరుసలుగా విస్తరణ తదితరాలు.
శంకుస్థాపనలు జరిగేవి..
* నాగార్జునసాగర్ నుంచి దావులపల్లి వరకు 48.46 కి.మీ. దూరం రూ.385 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ.
* అనంతపురం నగరంలోని టవర్‌క్లాక్, కలెక్టరేట్ మీదుగా పంగల్‌రోడ్ వరకు 9.20 కి.మీ. మేర రూ.311 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరణ.
* భద్రాచలం-కుంట మధ్య 63.87 కి.మీ. రూ.388 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ.
* కడప జిల్లాలోని రాయచోటి-వేంపల్లి మధ్య రూ.439.82 కోట్లతో 53.59 కి.మీ. రెండు వరుసలుగా విస్తరణ.
* చిత్తూరు జిల్లాలోని ములకలచెరువు-మదనపల్లి మధ్య 40.46 కి.మీ. రూ.480 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ.
* గుంటూరు జిల్లాలోని మాచర్ల-దాచేపల్లి మధ్య రూ.403 కోట్లతో 43.66 కి.మీ. రెండు వరుసలుగా విస్తరణ.
* దుత్తలూరు-కావలి మధ్య 67 కి.మీ. రూ.423 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ.
* బత్తలపల్లి-ముదిగుబ్బ మధ్య 33 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరణతో పాటు ముదిగుబ్బ బైపాస్ రూ.536 కోట్లతో నిర్మాణం.
ప్రారంభోత్సవాలు జరిగేవి..
* పశ్చిమగోదావరిలోని గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు 70 కి.మీ. మేర రూ.2,676 కోట్లతో నిర్మించిన నాలుగు వరుసల రహదారి.
* చిత్తూరు-మల్లవరం మధ్య 61.13 కి.మీ. మేర రూ.2,330 కోట్లతో నిర్మించిన ఆరు వరుసల రహదారి.
* నరసన్నపేట-రణస్థలం మధ్య 50 కి.మీ. రూ.1,457 కోట్లతో ఆరు వరుసలుగా విస్తరణ.
* గిద్దలూరు-వినుకొండ మధ్య 112 కి.మీ. మేర రూ.925 కోట్లతో నిర్మించిన రెండు వరుసల రహదారి.
* కలపర్రు నుంచి చిన్నఅవుటపల్లి వరకు రూ.655 కోట్లతో 27 కి.మీ. ఆరు వరుసలుగా విస్తరణ.
* అనంతపురం జిల్లాలోని కొడికొండ నుంచి మడకశిర వరకు రూ.505 కోట్లతో 59 కి.మీ. రెండు వరుసలుగా విస్తరణ.
* మదనపల్లి-పుంగనూరు-పలమనేరు మధ్య 54 కి.మీ. రూ.309 కోట్లతో విస్తరణ.
కావాలనే ఫ్లెక్సీల్లో ప్రధాని ఫోటో ఏర్పాటు చేయలేదు..
రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ప్రధాని మోదీ లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటంపై.. భాజపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మోదీ ఫొటో లేకుండా చేసిందని.. భాజపా రాష్ట్ర కమిటీ నేతలు బెంజ్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. లోపాలు సరిచేయకుంటే కేసులు నమోదు చేయిస్తామన్న పార్టీ నేతలు.. ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
PAWAN ON DGP TRANSFER: సవాంగ్‌ను ఎందుకు బదిలీ చేశారో ప్రజలకు చెప్పాలి: పవన్