ETV Bharat / city

BUGGANA: 'భోగాపురం ప్రారంభమయ్యాక.. అక్కడ విమాన సేవలు నిలిపివేయండి''

సీఎంలు, ఆర్థిక మంత్రులతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, మౌలిక వసతులపై చర్చించారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
author img

By

Published : Nov 15, 2021, 9:51 PM IST

Updated : Nov 15, 2021, 10:58 PM IST

ఈశాన్య రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్​లోని పరిశ్రమలకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులతో కేంద్రమంత్రి వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి బుగ్గన పాల్గొన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌కు 20 ఏళ్లు సుంకాలతో పాటు.. సీజీఎస్‌టీ, ఆదాయపన్ను, దిగుమతి సుంకం రియంబర్స్‌ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, మౌలిక వసతుల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి రాష్ట్రం ఖర్చు పెట్టిన నిధులివ్వాలని వినతి చేశారు. 'ఉడాన్‌' కింద రూ.176 కోట్లు రియంబర్స్‌ చేయాలని మంత్రి బుగ్గన కోరారు. భోగాపురం ప్రారంభమయ్యాక విశాఖ విమానాశ్రయం మూసేయాలని వివరించారు. వివిధ ప్రాజెక్టులకు వయబలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కార్పస్‌ ఏర్పాటు చేయాలని, కేంద్రానికి ఇచ్చిన భూముల్లో ప్లాంట్లు రాకుంటే తిరిగి రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి.

Last Updated : Nov 15, 2021, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.