ETV Bharat / city

విశాఖ ఉక్కు అమ్మేస్తాం.. రామాయపట్నం పోర్టుకు డబ్బులివ్వలేం: కేంద్రం - విశాఖ స్టీల్​ ప్లాంట్​పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత న్యూస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంలో రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. మరోవైపు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయం చేయలేమని స్పష్టం చేసింది.

విశాఖ స్టీల్ అమ్మేస్తున్నాం.. రామయపట్నం పోర్టుకు డబ్బులివ్వం: కేంద్రం

author img

By

Published : Mar 8, 2021, 5:50 PM IST

Updated : Mar 8, 2021, 6:56 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రామాయపట్నం పోర్టు నిర్మాణంపై పార్లమెంటులో కేంద్ర మంత్రులు స్పష్టతనిచ్చారు. మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగాల కల్పన కోసమే విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని.. సాయం చేయలేమని మరో కేంద్రమంత్రి మన్​సుఖ్ మాండవీయ స్పష్టతనిచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​లో వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ

విశాఖ ఉక్కు కర్మాగారంలో మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగాల కల్పన కోసమే..పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన ఆమె.. ఈ కర్మాగారంలో రాష్ట్రానికి ఎటువంటి ఈక్విటీ షేర్ లేదన్నారు. వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని నిర్ణయం జరిగిందన్నారు. భాగస్వాములు, ప్రస్తుత ఉద్యోగులతో..షేర్ కొనుగోలు ఒప్పందం కోసం ప్రత్యేక ప్రతిపాదన పెట్టినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

పోర్టు నిర్మాణానికి సాయం చేయలేం

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయం చేయలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సహాయం చేయలేమని పార్లమెంటులో స్పష్టం చేసింది. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని వివరించింది. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పోర్టు నిర్మాణానికి సాయం చేయలేమని తెలిపింది. రాజ్యసభలో టి.జి. వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్ట ప్రకారం పెద్ద పోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రానిదని స్పష్టం చేశారు. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందన్నారు. నాన్‌ మేజర్‌ పోర్టుల అభివృద్ధి బాధ్యత రాష్ట్రాలకే ఉంటుందన్నారు. రామాయపట్నం అభివృద్ధి చేయాలంటే చట్టంలో మార్పులు తేవాలన్నారు.

ఇదీ చదవండి: 2022 ఏప్రిల్​కు పోలవరం పనులు పూర్తవుతాయి: కేంద్రం

Last Updated : Mar 8, 2021, 6:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.