ETV Bharat / city

మలేరియా నిర్మూలనలో... ఏపీకి కేంద్ర ప్రభుత్వ పురస్కారం - ఏపీలో మలేరియా కేసులు

మలేరియా నిర్మూలనలో ఏపీకి కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకోనుంది. రాష్ట్రంలో 2018లో 6,040 కేసులు నమోదు కాగా.... 2021లో ఆ సంఖ్య 1,139కి తగ్గింది.

Malaria
Malaria
author img

By

Published : Apr 25, 2022, 5:50 AM IST

మలేరియా నిర్మూలనలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకోనుంది. మలేరియా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా చేసిన కృషికి... 2018లో నమోదయిన 6,040 కేసులు.... 2021లో 1,139కి తగ్గాయి. ఏపీ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పురస్కారాన్ని ప్రకటించింది.

2021లో మొత్తం 75,29,994 రక్తపరీక్షల నమూనాలను పరీక్షించగా.... అందులో 1,139 మందికి మలేరియా సోకినట్లు నిర్ధరణ అయింది. హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో 2021లో 21.5 లక్షలు.... రాష్ట్రంలో మొత్తమ్మీద 25.94 లక్షల దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. హైరిస్క్ ప్రాంతాల్లో ఏటా ఇళ్లలో దోమల నిరోధం కోసం.... ఇండోర్‌ రెసిడ్యుయల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది అన్ని ఆరోగ్య కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో... దోమల నిరోధక వలలు ఏర్పాటుచేసింది. ఫ్రైడే- డ్రైడే పేరిట క్రిమి కీటక నిరోధఖ, ఆరోగ్య పరిరక్షణ యాప్‌ను అభివృద్ధి చేసిన ప్రభుత్వం.... అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో దోమల కట్టడి, మలేరియా నిరోధం కోసం చర్యలు ప్రారంభించింది. దోమల పెరుగుదలను అరికట్టే చర్యల్లో భాగంగా... గత ఏడాది మత్స్యశాఖ సమన్వయంతో.. 24 లక్షల గంబూజియా చేపలను పెంపకందారులకు పంపిణీ చేసింది. ఈ చర్యల ఫలితంగా... ఈ ఏడాది ఇప్పటి వరకూ కేవలం... 117 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కండోమ్ లేకుండా సెక్స్.. 17లక్షల మందికి హెచ్​ఐవీ​.. ఆంధ్రప్రదేశ్​ టాప్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.