GPF: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నిధులు విత్‌డ్రా చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించడంపై తెదేపా ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తెలియకుండా వారి అనుమతి తీసుకోకుండా జీపీఎఫ్ ఖాతాల నుంచి విత్ డ్రా చేసిందా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 68వేల 20మంది ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన డీఏ మొత్తం నుంచి 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో 413కోట్ల 73లక్షల రూపాయలు విత్‌డ్రా చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: