దేశ పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్, విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. దీనిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో దేశంలో ప్రభుత్వ ఆస్తులు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ను ప్రైవేటీకరించి రైతులకు అన్యాయం చేస్తున్నారన్న చింతా మోహన్.. రాబోయే రోజుల్లో విద్యుత్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ పరిస్థితులతో త్వరలోనే రాష్ట్రంలో అంధకారం నెలకొనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులను వాహనంతో తొక్కించి చంపడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
దేశ పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. రాబోయే రోజుల్లో దేశంలో ప్రభుత్వ ఆస్తులు ఉండవు. విద్యుత్‌ను ప్రైవేటీకరించి రైతులకు అన్యాయం చేస్తున్నారు. రైతులను తొక్కించి చంపడం దుర్మార్గం.
-చింతా మోహన్, కేంద్ర మాజీ మంత్రి
ఇదీచదవండి.