రాష్ట్రంలో రీసెర్చ్ అండ్ లెర్నింగ్ కేంద్రం ఏర్పాటు కానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం అంశంపై రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షుడు టి.విజయ కుమార్, ఇతర అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.సేంద్రీయ విధానంలో సాగు చేపట్టే రైతుల్లో పరిజ్ణానాన్ని పెంపొందించేలా పరిశోధనా ఫలితాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు సేంద్రీయ సాగు విధానాల పట్ల సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం-జర్మనీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.48.50 కోట్లు, జర్మనీ రూ.174.2 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పులివెందులలో ఇండో-జెర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఆగ్రోఇకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ కేంద్రాన్ని ప్రారంభిస్తారని సీఎస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను, ఈ-క్రాపింగ్, సేంద్రీయ వ్యవసాయ విధానాలను ఈ కేంద్రంతో అనుసంధానించటం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సి ఉందని చెప్పారు.
ఇదీ చదవండి
visakha steel: విశాఖ ఉక్కుపై గళమెత్తిన ఎంపీలు.. ప్రైవేటీకరణే ఉత్తమమన్న కేంద్రం