పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్‌తో.. వినూత్న ప్రయోగం చేశారు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు. కళాశాల ఆవరణలో, క్యాంటీన్లో పడి ఉన్న ప్లాస్టిక్ సీసాలు సేకరించి.. సిమెంట్ బల్లలు తయారు చేశారు. ఇటుక బదులు ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించారు. వాటిలో ఇసుక నింపి నిర్మాణానికి వినియోగించి మంచి ఫలితాన్ని సాధించారు. త్వరలోనే చెప్పుల స్టాండ్లు తయారు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న నిర్మాణాలకు ప్లాస్టిక్ వినియోగిస్తే ఖర్చు తక్కువ అవుతుందని.. పర్యావరణానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని పంచుతున్నారీ విద్యార్థులు.
ఇటుక బదులు ప్లాస్టిక్... పర్యావరణ పరిరక్షణకు ఇదో ట్రిక్! - sri durga malleshwara sidhartha mahila college
నిర్మాణాల్లో ఇటుక బదులు ప్లాస్టిక్ వాడకాన్ని ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇదెలా సాధ్యమన్న ఆలోచన వస్తే.. విజయవాడలోని ఈ కళాశాల సిబ్బంది, విద్యార్థులు చేసిన మంచి ప్రయత్నాన్ని తెలుసుకోండి.
పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్‌తో.. వినూత్న ప్రయోగం చేశారు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు. కళాశాల ఆవరణలో, క్యాంటీన్లో పడి ఉన్న ప్లాస్టిక్ సీసాలు సేకరించి.. సిమెంట్ బల్లలు తయారు చేశారు. ఇటుక బదులు ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించారు. వాటిలో ఇసుక నింపి నిర్మాణానికి వినియోగించి మంచి ఫలితాన్ని సాధించారు. త్వరలోనే చెప్పుల స్టాండ్లు తయారు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న నిర్మాణాలకు ప్లాస్టిక్ వినియోగిస్తే ఖర్చు తక్కువ అవుతుందని.. పర్యావరణానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని పంచుతున్నారీ విద్యార్థులు.
ప్లాస్టిక్ సీసాల వినియోగం పెరిగింది. వాడేసిన ప్లాస్టిక్ సీసాలను ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఫలితంగా పర్యావరణం కలుషితమవుతుంది. దీనికి ఒక వినూత్న ఆలోచన చేశారు కళాశాల అధ్యాపకులు విద్యార్థినులు.
ప్లాస్టిక్ రహితంగా, పర్యావరణ హితంగా తమ కళాశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు. కళాశాల ఆవరణలో, క్యాంటీన్లో సేకరించిన ప్లాస్టిక్ సీసాలను సేకరించి వాటితో విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బల్లలు తయారు చేశారు. ప్లాస్టిక్ సీసాల్లో ఇసుక నింపి, ఇటుకల కి బదులుగా సీసా లనే వరుసగా పేర్చి సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసి సిమెంట్ బల్లలు నిర్మించారు. పచ్చదనం నడుమ ఏర్పాటుచేసిన సిమెంట్ బల్లపై కూర్చొని విద్యార్థులు భోజనం చేస్తున్నారు, చదువుకుంటున్నారు. పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ప్లాస్టిక్ సీసాలను ఇలా కూడా వినియోగించవచ్చు అని విద్యార్థినులకు వివరిస్తున్నారు. ఈ ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్ సీసాలు వినియోగించి త్వరలో చెప్పుల స్టాండ్లు కూడా తయారు చేస్తామని చెబుతున్నారు.
బైట్........... డాక్టర్ కె లక్ష్మి, అధ్యాపకురాలు, సిద్ధార్థ మహిళా కళాశాల
- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్, 8008574648.
Body:పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇటుకల కు బదులుగా ప్లాస్టిక్ సీసా ల వినియోగం
Conclusion:పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇటుకల కు బదులుగా ప్లాస్టిక్ సీసా ల వినియోగం