Gidugu Ramamurthy Pantulu Jayanti తెలుగు భాషా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి (ఆగస్టు 29)ని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించనున్నట్లు అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. అమరావతిలో రాష్ట్రస్థాయి వేడుకతో పాటు జిల్లాల్లోనూ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని భాషా వికాసానికి పాల్పడిన 40 మందిని సత్కరించనున్నట్లు తెలిపారు. అధికార భాషా సంఘం ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేశామని స్పష్టం చేశారు.
తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చిందని మైసూరులోని భారతీయ భాషల అధ్యయన కేంద్రంలో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం మైసూరు నుంచి నెల్లూరుకు ప్రాచీన భాష అధ్యయన కేంద్రం తీసుకువచ్చామన్నారు. తెలుగు భాషా ప్రాధికార సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలుగు భాష వినియోగించని అధికారులపై చర్యలకు కూడా సిఫార్సులు చేస్తున్నట్టు వెల్లడించారు. సెప్టెంబరు 1 నుంచి అధికార భాషా ప్రాధికార సంస్థ జిల్లాల్లో పర్యటిస్తుందన్నారు.
ఇవీ చదవండి: