ETV Bharat / city

CBN on Municipal Elections: ఫేక్ సీఎం..ఫేక్‌ సంతకాలతో తనవారిని గెలిపించుకున్నారు: చంద్రబాబు

author img

By

Published : Nov 11, 2021, 7:02 PM IST

Updated : Nov 11, 2021, 9:49 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫేక్ ముఖ్యమంత్రి..ఫేక్‌ సంతకాలతోనే తనవారిని గెలిపించుకున్నారని ముఖ్యమంత్రి జగన్​ను (CM Jagan) ఎద్దేవా చేశారు.

CBN
CBN
ఫేక్ సీఎం..ఫేక్‌ సంతకాలతో తనవారిని గెలిపించుకున్నారు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) ప్రక్రియ దుర్మార్గంగా సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు ఏకగ్రీవాలు పెరిగాయన్నారు. పలుచోట్ల బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందని ఆరోపించారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు (unanimous) చేసుకున్నారని ఆక్షేపించారు. అభ్యర్థులు కోర్టుకు (Courts) వెళ్తే..మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని హెచ్చరించారు. నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు ఫోర్జరీ (Signatures forgery) చేశారని.. న్యాయస్థానంలో తేలిందన్నారు. ఈ మేరకు తిరుపతిలో స్థానిక ఎన్నికల్లో జరిగిన నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియలో తేలిన ఫోర్జరీ సంతకం వ్యవహారాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టారు. దీనికి ఆర్వోలు (RO's) బాధ్యత వహించి విధుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌ రెడ్డి క్విడ్ ప్రోకోలో (CM jagan) సిద్ధహస్తుడని కోర్టులు చెప్తున్నాయని దుయ్యబట్టారు. ఫోర్జరీ సంతకాలకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి జగన్ పదవి నుంచి వైదొలగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు ఏకగ్రీవాలు పెరిగాయి. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగింది. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. నామినేషన్ ఉపసంహరణ పత్రంపై చేసిన సంతకాలు ఫోర్జరీ అని తేలింది. ఫేక్ ముఖ్యమంత్రి.. ఫేక్‌ సంతకాలతోనే తనవారిని గెలిపించుకున్నారు. -చంద్రబాబు, తెదేపా అధినేత

జగన్​ను మేలుకొల్పేందుకు...

నిద్ర నటిస్తున్న జగన్ రెడ్డిని గట్టిగా దెబ్బకొట్టి మేలుకొల్పేందుకు మున్సిపల్ ఎన్నికల్లో (municipal Election) ఓటు ఆయుధాన్ని ప్రజలు ఉపయోగించాలని చంద్రబాబు కోరారు. ఉపేక్షిస్తే రానున్న రోజుల్లో దొంగ ఐడీలు (Fake ID's) కూడా సృష్టించి ఓటు హక్కును కూడా దుర్వినియోగం చేస్తారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలే కుప్పంలోనూ అమలు చేసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పం 14వ వార్డును ఇదే తరహా అక్రమాలతో ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. పులవర్తి నాని, రామానాయుడు గృహనిర్బంధంపై (House arrest) న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు లెక్కచేయట్లేదని ఓ వీడియో (Video) ప్రదర్శించారు. గురజాల, దాచేపల్లిలోనూ ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థలో త్యాగాలు చేసినవారెందరో ఉన్నారన్న చంద్రబాబు..,వారికి కళంకం తెచ్చేలా చట్టవిరుద్ధంగా వ్యవహరించే అధికారులకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ మానవత్వంతో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

ఇవీ చదవండి

FARMERS MAHA PADAYATRA: అమరావతి పాదయాత్రపై లాఠీఛార్జ్.. విరిగిన రైతు చేయి

వైకాపా దౌర్జన్యాలకు పాల్పడినా.. తెదేపా జెండా ఎగరవేస్తాం: మాజీ ఎమ్మెల్యే యర్రపతినేని

Last Updated : Nov 11, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.