ETV Bharat / city

ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. జమైకాలో వినూత్నంగా సెలబ్రేషన్స్ !

author img

By

Published : Apr 20, 2022, 10:00 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. తెదేపా నేత మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను జమైకాలో వినూత్నంగా నిర్వహించారు. బహమాస్, జమైకా దీవుల మధ్య ప్రపంచంలోనే అతి పెద్ద ఓడల్లో ఒకటైన రాయల్ కరీబీయన్ వారి హార్మొనీ ఆఫ్ ది షిప్​లో కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను జమైకాలో వినూత్నంగా నిర్వహించారు. బహమాస్, జమైకా దీవుల మధ్య ప్రపంచంలోనే అతి పెద్ద ఓడల్లో ఒకటైన రాయల్ కరీబీయన్ వారి హార్మొనీ ఆఫ్ ది షిప్​లో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. సముద్రం మధ్యలో మన్నవ మోహన్ కృష్ణ కేక్ కట్​ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఏపీని కాపాడే సమర్థవంతమైన నేత చంద్రబాబు మాత్రమేనని కొనియాడారు. మాతృభూమిని కాపాడుకోవటానికి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రవాసభారతీయులపై ఉందన్నారు. ప్రతి ప్రవాస భారతీయుడు మాతృభూమి రుణం తీర్చుకోవడానికి, ఏపీని అభివృద్ధి పథంలోకి నడపటానికి 2024లో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావటానికి ప్రయత్నించాలన్నారు.

చికాగోలో తెదేపా నేత బీద రవిచంద్ర, డల్లాస్​లో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ముళ్లపూడి బాపిరాజు, న్యూజెర్సీలో కలపాతము రామ్ ప్రసాద్, షార్లెట్​లో ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఇదీ చదవండి:CBN Birthday Celebrations: రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.