CBI searches in Prakasam: బ్యాంకు మోసాల కేసుకు సంబంధించి.. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేసిన సీబీఐ.. రూ.940 కోట్ల బ్యాంకుల మోసానికి సంబంధించి సోదాలు జరిపింది.
ప్రకాశం జిల్లాలో సోదాలు..
రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన బీకే త్రెషర్స్ సంస్థ ఛైర్మన్, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో.. సీబీఐ సోదాలు చేపట్టింది. బీకే ఎక్స్ పోర్ట్స్, మహి ఆగ్రో సంస్థ అధికారుల ఇళ్లలో సైతం సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో.. మొత్తం రూ.228.02 కోట్ల మేర బ్యాంకును మోసగించినట్లు వెల్లడించింది.
తెలంగాణలో..
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.. హైదరాబాద్‌లోని విజయ ఏరో బ్లాక్స్ సంస్థ డైరెక్టర్ల ఇళ్లు సహా.. ప్రైవేటు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. విజయ ఏరో బ్లాక్స్‌కు చెందిన 3 ప్రదేశాల్లో సోదాలు జరిపిన సీబీఐ.. బ్యాంకుకు రూ.44.60 కోట్ల నష్టంపై కేసు నమోదైనట్లు వెల్లడించింది. సోదాల్లో విలువైన పత్రాలు.. బ్యాంకు లావాదేవీల వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ సహా.. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.
ఇదీ చదవండి: