వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల(cm jagan illegal property case)పై సీబీఐ(cbi), ఈడీ కోర్టులో విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని జగన్ సహా పలువురికి సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. అరబిందో హెటిరో కేసు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో నిందితులు వాదనలకు సిద్ధం కావాలని తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య, అరబిందో ఫార్మసీ ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ శరత్ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్, బీపీ ఆచార్య వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి..
CM Jagan: 'వ్యవసాయ రంగం ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి'