ఇదీ చదవండి : నేటి నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టు పరీక్షలు
కరోనా భయం: రెండో రోజు ఇంటింటి సర్వే
రోజు రోజుకి కరోనా వైరస్ వ్యపిస్తున్నందున వైద్యశాఖ ఇంటింటి సర్వే ప్రారంభించింది. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏన్‌ఎంలు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నారు. నిన్న మొదలైన సర్వే నేడూ కొనసాగనుంది. కరోనా నిర్ధరణ జరిగిన వారి ఖర్చులను ఆరోగ్య శ్రీ ద్వారా భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రజల సందేహాలు తీరుస్తున్నామని కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జి డాక్టర్ సావిత్రి తెలిపారు.
కరోనా భయం: రెండో రోజు ఇంటింటి సర్వే