ETV Bharat / city

తాత్కాలిక రిజర్వాయర్లుగా పోలవరం కాపర్ డ్యామ్​లు

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టులో నిర్మించే తాత్కాలిక మట్టికట్ట ఓ తాత్కాలిక రిజర్వాయర్​లా మారిపోనుంది. ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు మరో ఏడాది పట్టనుండటంతో ఎగువ, దిగువ కాపర్ డ్యామ్​ల నిర్మాణాన్ని వేగవతం చేశారు.

తాత్కాలిక రిజర్వాయర్లుగా పోలవరం కాపర్ డ్యామ్​లు
author img

By

Published : May 11, 2019, 3:33 PM IST

తాత్కాలిక రిజర్వాయర్లుగా పోలవరం కాపర్ డ్యామ్​లు

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన ఆనకట్ట ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం కంటే ముందే నిర్మించే కాపర్​ డ్యామ్​లు తాత్కాలిక రిజర్వాయర్లుగా మారనున్నాయి. ఎగువ కాపర్ డ్యామ్​ను నదీ గర్భంలోంచి 42.5 మీటర్ల ఎత్తున నిర్మించాలని నిర్ణయించారు. నదీ ప్రవాహ మార్గంలో నిర్మిస్తున్న ఈ కాపర్ డ్యామ్ తాత్కాలిక ఆనకట్ట పనులు 40 శాతం మేర పూర్తయ్యాయి. దాదాపు 76 లక్షల క్యూబిక్ మీటర్ల పనుల్లో 38 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి, రాళ్లను ఆ ప్రాంతంలో పరిచారు. గోదావరి నది కుడి, ఎడమ గట్టుల వైపు నుంచి కొంతమేర ఖాళీ ఇచ్చి కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని నదిగర్భంలో సమాంతరంగా చేపట్టారు. అయితే ఈ నిర్మాణం కారణంగా దాదాపు 23 టీఎంసీల మేర నీరు నిల్వ ఉండే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీచదవండి

మూగజీవాల పట్ల 'భగీరథుడు'

Intro:నెల్లూరు జిల్లా

Body: సూళ్లూరుపేట పులికాట్ సరసు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.