కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని విజయవాడ నోవాటెల్‌లో నిర్వహించారు. నగరానికి చెందిన మహిళా ప్రముఖులు, కేర్ అండ్ షేర్ ఛారిటబుల్ ట్రస్టు యువతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సుమారు రెండునెలలు ఉండగానే ఈ కార్యక్రమం నిర్వహించారు.
కేక్ తయారిలో అనేక రకాల డ్రైఫ్రూట్స్, వివిధ రకాల మధుపానీయాలను కలిపి అద్భుత రుచిని తీసుకొచ్చామని ఎగ్జిక్యూటివ్ చెఫ్ వినయకుమార్ తెలిపారు. ఈ కేకుల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేర్ అండ్ షేర్ ఛారిటబుల్ ట్రస్టుకు అందజేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: AMARAVATHI PADAYATHRA : మరో ముందడుగు... ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర