తెదేపా హయాంలో అవినీతి ఆరోపణలపై నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో... గోదావరి పుష్కరాల ఘటనపై కూడా విచారణ జరిపించాలని యోచిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.
గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి కారణమెవరని శాసనసభ్యుడు జోగి రమేష్ ప్రశ్నించారు. ఆనాటి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అక్కడ జరిగిన సినిమా షూటింగ్ వల్లే తొక్కిసలాట జరిగిందని జోగి రమేష్ మండిపడ్డారు. పుష్కరాల్లో వేల కోట్ల దోపిడీ జరిగిందని... అది కుంభమేళా కాదు...కుంభకోణం అని ఎద్దేవా చేశారు. ముహూర్తానికి స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందన్న ప్రచారంతోనే ఘటన జరిగిందని మరో వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.
ఇదీ చదవండి