నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే విజయవాడ వాణిజ్య కేంద్రాలు.. కరోనాదెబ్బకు వెలవెలబోతున్నాయి. జనాలు రాక, వ్యాపారాలు సాగక, అద్దెలు చెల్లించలేక దుకాణాలు ఖాళీ అవుతున్నాయి. చాలామంది సిబ్బందిని తగ్గించేస్తున్నారు. 20 మంది పనిచేసే ప్రాంతంలో ఇద్దరు ముగ్గురితో నడిపిస్తున్నారు. ఆర్థికంగా తాము ఎంత నష్టపోయినా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ బెజవాడ వర్తక, వాణిజ్య వ్యాపారులు స్వచ్ఛందంగా పనివేళలు తగ్గించుకున్నారు. ఈనెల 30 దాకా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ఆదివారం రద్దీ దృష్ట్యా పూర్తిగా మూసివేయనున్నారు.
అద్దెలు భరించలేక...
విజయవాడలో వినోదరంగానికి అధిక ప్రాధాన్యముంటుంది. పెద్దసంఖ్యలో... సినిమాహాళ్లు, మల్టీపెక్స్‌లతోపాటు గేమింగ్, ఫుడ్‌కోర్టులు ఎక్కువగా ఉంటాయి. మల్టీప్లెక్సులు, షాపింగ్ మాళ్లతోపాటు ఎలాంటి వస్తువైనా దొరికే బీసెంట్ రోడ్డు, వన్ టౌన్‌లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతారు. కరోనా సెకండ్‌వేవ్ దెబ్బకు మల్టీప్లెక్స్‌ల వైపు జనం రావడంలేదు. అద్దెలు భరించలేక కొన్ని దుకాణాలు ఖాళీ అవుతున్నాయి. వేల ఉద్యోగాలు ఎగిరిపోయాయి. చిరువ్యాపారుల నుంచి పెద్దవారి వరకూ నష్టాలు చవిచూస్తున్నారమంటున్నారు వ్యాపారులు.
కరోనా కేసులు పెరుగుతున్న వేళ మున్ముందు ఇంకెన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాలోననే ఆందోళన వ్యాపారవర్గాల్లో నెలకొంది. అద్దెలు తగ్గించినా దుకాణాల నిర్వహణకు ముందుకు రాని పరిస్థితి ఉందని యజమానులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: