ETV Bharat / city

ఆధునిక సదుపాయలు వద్దు... కనీస సౌకర్యాల షెలర్ట్‌ ఇస్తే చాలు... - in

ఎండకు ఎండుతూ....వానకు తడుస్తూ....ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ బస్సుల కోసం వేచి చూసే పరిస్థితి ఇకపై కనిపించదు. సకల సౌకర్యాల బస్ షెల్టర్ల ఏర్పాటు... భద్రత కల్పిస్తామన్న ప్రచారం ఉత్తుత్తిదేనని తేలింది. సదుపాయాల మాట అటుంచితే పదిమంది నిల్చొనే పరిస్థితి లేని విధంగా బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేశారు.

ఆధునిక సదుపాయలు వద్దు... కనీస సౌకర్యాల షెలర్ట్‌ ఇస్తే చాలు...
author img

By

Published : Jul 29, 2019, 9:12 AM IST

స్ట్రీట్ ఫర్నిచర్‌లో భాగంగా విజయవాడలో బస్ షెల్టర్ల నిర్మాణం, నిర్వహణకు ఓ ప్రముఖ ప్రచార సంస్థకు నగర పాలక సంస్థ కాంట్రాక్టు అప్పగించింది. ప్రతి షెల్టర్ నిర్మాణానికి 30 లక్షల రూపాయల చొప్పున వెచ్చించేందుకు అంగీకారం కుదిరింది. నిబంధనల ప్రకారం పాత షెల్టర్లు తొలగించి నూతన విధానంలో షెల్టర్ నిర్మాణం చేపట్టి....అందులో ఏసీ, ఫర్నిచర్, కాఫీ షాప్, వైఫై, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, టాయిలెట్‌తోపాటు సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఒక్కో షెల్టర్ 100 అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలి. టెండర్లు వేసిన 7 నెలలైనా అలాంటి బస్ స్టాపులు కనిపించడంలేదు.

నగరంలో 50 అడుగులు దాటకుండా నిర్మాణాలు చేపట్టారు. అవీ నాన్ ఏసీ బస్ షెల్టర్లు. మౌలిక సదుపాయల ఊసే లేదు. కేవలం ప్రచారం కోసం బస్టాపులు నిర్మించుకుందాం అన్న రీతిలో రూపొందించారు. ఈ స్టాపుల్లో ఎక్కడా బస్సుల క్రమసంఖ్య, సమయాల పట్టిక లేదు. ఎండ, వాన పడకుండా నిర్మాణాలు చేయలేదు.

బెంజి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, పటమట లాంటి ప్రదేశాల్లో అసలు ఇలాంటి బస్ స్టాపులే కనిపించవు. ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. కనీసం కూర్చునేందుకు సీట్లైనా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఏసీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తూ బందరు రోడ్డులోని సిద్ధార్థ మహిళా కళాశాల బస్ స్టాపును అభివృద్ధి చేశారు. గతేడాది నవంబర్‌లో ప్రారంభించారు. అధికారులు చెప్పినట్టు అందులో ఏసీ, భద్రతా సిబ్బంది మినహా మరే ఇతర సదుపాయాల్లేవు. కనీసం పది మంది కూర్చోలేని పరిస్థితి. బీఆర్టీఎస్ రోడ్డులో రైల్వే స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా సుమారు 25 కిలోమీటర్ల మేర ఏసీ బస్టాపులు నిర్మాణానికి అప్పటి పాలకవర్గం తీర్మానించింది. ఒక్కో బస్ స్టాపు నిర్మాణం కోసం రూ. 10 లక్షలు వెచ్చించారు. రద్దీ లేక ఆ షెల్టర్లు వృథాగా దర్శనమిస్తున్నాయి.

ఆధునిక సదుపాయలు వద్దు... కనీస సౌకర్యాల షెలర్ట్‌ ఇస్తే చాలు...

ఇవీ చదవండి..

వర్షాకాలం...నెలలు కాదు..రోజులే...

Intro:AP_RJY_61_26_ROADS_DAMAGED_PKG_AVB_AP10022

Body:AP_RJY_61_26_ROADS_DAMAGED_PKG_AVB_AP10022

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.