ETV Bharat / city

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారంగా.. ముడి సరుకుల ధరలు - ap latest news

పెరిగిన ముడి సరుకుల ధరలు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారంగా మారాయి. ముడి సరుకు అందుబాటులో లేని కారణంగా.. వ్యయం పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఉత్పత్తి తగ్గిపోతోంది. పెరిగిన ముడి సరకులు ధరలను తట్టుకోవటం కష్టంగా మారిందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాబోయే రెండేళ్లలో 50శాతం పరిశ్రమలు మూతపడుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

burden on industries due to prices of raw material
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారంగా.. ముడి సరుకుల ధరలు
author img

By

Published : Jan 9, 2022, 5:08 PM IST

ముడి సరుకుల ధరలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారం

వ్యాపారంలో రాణించాలంటే.. ఇతర సంస్థలతో పోటీపడాలి. కానీ సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల్లో అలా కాదు. ఒక ఉత్పత్తి తయారు కావాలంటే పది పరిశ్రమల సహకారం కావాలి. ఒకరు బాగుపడితే పదిమందీ బాగు పడతారు. ఒకరు నష్టపోతే పదిమందికీ నష్టమే. ఈ తరహా సప్లై చైన్ మేనేజ్మెంట్ కలిగిన పరిశ్రమలన్నీ ఇప్పుడు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందుకు కారణం పెరిగిన ముడి సరుకుల ధరలేనని యాజమాన్యాలు చెబుతున్నారు.

రాష్ట్రంలో దాదాపు 97వేల చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయంలో.. ముడి సరుకుల వాటా 70శాతం వరకు ఉంటుంది. గతేడాది నవంబర్‌ ధరలతో పోలిస్తే ఇనుప పలకల ధర 75శాతం పెరిగింది. తుక్కు ఇనుము ధర 88శాతం, కోకింగ్ కోల్ ధర 96శాతం పెరిగాయి. ఈ స్థాయిలో తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం లేదని నిర్వాహకులు వాపోతున్నారు.

కార్మికుల కొరత చిన్నతరహా పరిశ్రమలను వేధిస్తోంది. రోజుకు వెయ్యి రూపాయాలు ఇస్తామన్నా దొరకని పరిస్థితి నెలకొందని అంటున్నారు. పెరిగిన ఖర్చులు, కార్మికుల కొరత వల్ల ఇప్పటికే అనేక సంస్థలు మూతపడ్డాయని చెబుతున్నారు. స్టీల్ ఎగుమతులు పెరగడంతో..దేశీయంగా ధరలు పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చిన్న పరిశ్రమలను కాపాడేందుకు ఎగుమతులు నిలిపి, ధరలను నియంత్రించాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నా ఫలితం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి:

Video Viral: 'జగన్ గారూ.. ఇటు వాహనమిత్ర డబ్బులిచ్చి.. అటు అధిక పన్నులతో లాక్కుంటారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.