తెదేపా నేతలపైనే ఐటీ దాడులు జరగటం వెనుక కేంద్రం కుట్ర ఉన్నట్లు తెదేపా నేత బుద్ధా వెంకన్న అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ సూచించిన నేతలపైనే ఐటీ దాడులు....బుద్ధా వెంకన్న జగన్ సూచించిన తెదేపా నేతలపైనే కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. దత్తపుత్రుడు కాబట్టే జగన్కు అనుకూలంగా మోదీ వ్యవహరిస్తున్నారని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. తెదేపా కంటే ఎక్కువమంది ధనవంతులు వైకాపాలోఉన్నారన్నారు. పీవీపీ, రామచంద్రారెడ్డి, బొత్స, మాగంటి వంటి వారిపై ఐటీ దాడులు ఎందుకు జరగటం లేదని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా జగన్ కుట్ర పన్నుతున్నారని విమర్శించిన బుద్ధా వెంకన్న...ఎన్నికల కోసం కోట్ల రూపాయలు పీవీపీ ఇంట్లో సిద్ధంగా ఉంచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ఐటీ దాడుల్ని మ్యాచ్ ఫిక్సింగ్ దాడులుగా బుద్ధా పేర్కొన్నారు...
ఇవి చదవండి
కేసీఆర్ బిస్కెట్ల కోసం రాష్ట్రానికి అన్యాయం : పవన్