తల్లిపాల వారోత్సవాలను దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో ప్రారంభించారు. 'తల్లిపాలు జీవితామృతం' అనే నినాదంతో ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఐఎంఏ అసోయేషన్ కార్యాలయం నుంచి పాత ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రదర్శన నిర్వహించారు. తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ అఖిల భారత పిల్లల వైద్య నిపుణుల మండలి రూపొందించిన ఓ యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్రతి శిశువుకు ఆరు నెలల వరకు తల్లి పాలు అందించకపోతే పిల్లలు ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు తెలిపారు.
ఇదీ చదవండి.. నాలుగు రోజుల్లోనే..4 లక్షలకు పైగా దరఖాస్తులు