ఇళ్ల పట్టాలకు సంబంధించి తెదేపాపై అసత్యాలు ప్రచారం చేశామని వైకాపా ప్రభుత్వం మంత్రివర్గంలో ఒప్పుకుందని... తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడారు.
తెదేపా న్యాయస్థానాన్ని ఆశ్రయించటం వల్లే పేదలకు సెంటు భూమి ఇవ్వలేకపోతున్నామని విమర్శలు చేశారు. డిసెంబర్ 25న కార్యక్రమం చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవటంతో తెదేపాపై చేసినవి అసత్య ఆరోపణలని ఒప్పుకున్నారు. దీనిపై మాకు క్షమాపణలు చెప్పాలి. తెదేపా అధికారంలోకి వచ్చాక 3సెంట్లు భూమి ఇస్తాం. మంత్రివర్గ సమావేశానికి పార్టీ సమావేశానికి తేడా లేకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులు పరిహారంపై ప్రకటన ఉంటుందేమోనని ఆశించారు. దీనిపై కనీస చర్చ లేకుండా తూతూ మంత్రం సమావేశంగా మార్చేశారు. తుపాన్ బాధితులందరికీ రూ.5వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. పోలవరంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. అవినీతి వాటాలు తేల్చుకునేందుకే మంత్రివర్గంలో ప్రాధాన్యమిచ్చారు.-బొండా ఉమా
ఇదీ చదవండీ...