నదుల్లో పర్యటక బోట్లు ప్రమాదాల నివారణ కోసం నదీ తీర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నిరంతర పర్యవేక్షణ, భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల కంట్రోల్ కేంద్రాలను నెలకొల్పింది. అన్ని అనుమతులు తీసుకోవడం సహా తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే నదిలో బోటింగ్ కు అనుమతులు ఇచ్చేలా సరికొత్త నిబంధనలను అమలు చేయనుంది. బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సులు, ఫిట్‌నెస్ పరిశీలన పకడ్భందీగా చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రమాదాల జరగకుండా పర్యటక, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ భద్రతా సిబ్బంది నిరంతరం పనిచేయనున్నారు. కంట్రోల్ రూంల పర్యవేక్షణ బాధ్యతలను తహసీల్దారు హోదా కల్గిన అధికారిని నియమించింది. ప్రతి కంట్రోల్ రూంలో సీసీటీవీ పర్యవేక్షణ సహా ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడానికి పెట్రోలింగ్, రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్లు ఈటీవీ భారత్ ముఖాముఖిలో అధికారులు వివరించారు.
ఇవీ చదవండి: పర్యటక కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన సీఎం జగన్