ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ అర్ధం మారుస్తోంది: సోము వీర్రాజు - సోమువీర్రాజు తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అర్థం మారుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు (bjp state president) సోము వీర్రాజు విమర్శించారు. ఉన్న ఉద్యోగులను తొలగించి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోందని దుయ్యబట్టారు.

సోమువీర్రాజు
సోమువీర్రాజు
author img

By

Published : Oct 16, 2021, 6:57 PM IST

రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌(job calender) అర్ధం మారుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veeraju) విమర్శించారు. ఉన్న ఉద్యోగులను తొలగించి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోందని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం ఇంతటి సాహసం చేయలేదని ఆరోపించారు. తొలగించిన ఉద్యోగులు చాలా కీలకమైన శాఖలో నిత్యం ప్రజలకు సేవ చేసే విభాగంలో పనిచేస్తున్న వారేనని.. ఒక కలం పోటుతో ఉద్యోగులను తొలగించడం దారుణమని మండిపడ్డారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్‌ హెల్త్ సెంటర్ ఉద్యోగులు తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ వీర్రాజును స్వయంగా కలసి విన్నవించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,700 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించి నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ అంటే ఉద్యోగాలు వస్తాయంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగులు ఆవేదన చెందారు. కరోనా రెండు సీజన్లలో తాము కష్టపడి పనిచేస్తే ప్రభుత్వం తమ ఉద్యోగాలను ఊడగొట్టిందని బాధితులు తమ గోడును వివరించారు.

నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్రం నిధులు ఇస్తుంటే ఉద్యోగాల నుంచి తొలగించడం ఏమిటని సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎప్పటి కైనా ప్రభుత్వం తమను శాశ్వత ఉద్యోగులుగా చేస్తుందని వారంతా ఆశిస్తుంటే.. వైకాపా ప్రభుత్వం ఇంటికి పంపేసిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్భన్ హెల్త్ సెంటర్​లను ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తామని చెప్పి 222 సెంటర్లలో ఉన్న నర్స్, స్టాఫ్ నర్స్, డేటాఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్వీపర్ తదితర ఉద్యోగులను తొలగించడాన్ని వీర్రాజు తప్పుపట్టారు. ఖాళీలు భర్తీ చేయడంతోపాటు పని చేస్తున్న ఉద్యోగులను తిరిగి నియమించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'రామోజీ ఫిలింసిటీ.. హైదరాబాద్​లో ఉండటం గర్వకారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.