రైతుల శ్రేయస్సు కోసం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల బిల్లులను ఉపసంహరించుకుంటున్న తరుణంలో కర్షకుల పట్ల భాజపా నిబద్ధతను అందరూ అర్ధం చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వ్యవసాయ బిల్లుల ఉపసంహరణపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనను భాజపా రాష్ట్ర శాఖ స్వాగతిస్తోందన్నారు. గురు నానక్ జయంతి సందర్భంగా ప్రధాని చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా రైతు చట్టాలపై వివరణ ఇచ్చారన్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. దేశంలో 80 శాతం సన్న, చిన్న కారు రైతులు కేవలం రెండు హెక్టార్ల భూమి మాత్రమే కలిగిన వారున్నారని..వారి మేలు కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారన్నారు.
ఈ చట్టాలపై రైతులు ఉద్యమం చేశారని...దీర్ఘకాలికంగా ఉద్యమం చేయడం శ్రేయస్కరం కాదని వీటిని ఉపసంహరించుకుంటున్నట్లు మోదీ ప్రకటించటం రైతుల పట్ల ప్రధాని ఎంత సానుకూలంగా ఉన్నారో తెలియజేస్తుందన్నారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్రం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేశారని...ఫసల్ భీమా యోజనను బలోపేతం చేస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించిందన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాలకు నగదు అందించే ప్రక్రియ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేస్తోన్న విషయాన్ని అంతా గుర్తించాలన్నారు.
ఇదీ చదవండి
Farm laws India: సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?