పార్టీ ప్లీనరీలో వైకాపా నేతలు అన్నీ అవాస్తవాలే చెప్పారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చేశాయంటూ చేసిన తీర్మానంతోపాటు అన్నింటిపైనా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో భాజపా రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తోందన్న సోము.. పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాలని శ్రేణులకు సూచించారు.
కేంద్రం అందిస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నడుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తున్న సాయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఉద్భోదించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశంలో పార్టీ భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ నిర్మిస్తే.. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సోము వీర్రాజు అన్నారు.
ఇవీ చూడండి :