ETV Bharat / city

'కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలి'

రాష్ట్రంలో హిందూ ధర్మం, దేవాలయాలు, విశ్వాసాలపై దాడి యాధృచ్ఛికం కాదని... కుట్రపూరితమేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అభిప్రాయపడింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేస్తోన్న ప్రకటనలు తన వ్యక్తిగతం కాదని... వాటిని ప్రభుత్వ వ్యాఖ్యలుగా భాజపా భావిస్తోందని... ముఖ్యమంత్రి వెంటనే స్పందించి దీనిపై ఓ ప్రకటన చేయాలని, మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది.

BJP State Level Meeting in vijayawada chaired by somu veerraju
'కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలి'
author img

By

Published : Sep 22, 2020, 7:16 PM IST

'కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలి'

భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయవాడలో మొట్టమొదటి పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఈ సమావేశంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాని, కేంద్ర మంత్రివర్గానికి అభినందనలు తెలిపారు.

మేడిపండు తరహాలో మంత్రి కొడాలి నాని మాటలు ఉంటున్నాయని... ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే మంత్రిని జైలులో పెట్టేవారని సమావేశం భావించింది. సమావేశంలో మూడు ప్రధాన తీర్మానాలు చేశారు. ఆ వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్​రెడ్డి, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మీడియాకు వెల్లడించారు.

అక్రమంగా అరెస్టు చేసిన హిందువులను విడుదల చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసే అంశాలపైనా తీర్మానం చేశారు. అమరావతి కేంద్రంగా మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా సమగ్రాభివృద్ధితోపాటు సురక్ష ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని... ఆ దిశగా ప్రజాభిమానంతో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో అంతా పని చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో కమల వికాసం ద్వారా అభివృద్ధి వికసిస్తుందన్నారు. మతతత్వ పార్టీగా పేర్కొంటున్న రాజకీయ పార్టీలే అసలైన మతతత్వ వాదులని... భాజపా లౌకికవాదంతో పని చేస్తోందని చెప్పారు. చర్చిలు కట్టినవారు, యాత్రలకు డబ్బులు ఇచ్చినవారు మతతత్వవాదులు కాదా..? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కోటి 40 లక్షల నివాసాలకు నిరాంటంకంగా- లోఓల్టేజి లేకుండా విద్యుత్తు ఇస్తోన్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇది భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ మంచి పాలనకు నిదర్శనమన్నారు. బూత్‌స్థాయి నుంచి తమ పార్టీ నిర్మాణానికి జిరాక్స్‌ కాపీయే.. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించి అమలు చేస్తోన్న వాలంటరీ వ్యవస్థ అని అన్నారు. కరోనా కాలంలో ప్రజలకు ఎంతోమంది భాజపా కార్యకర్తలు, నేతలు వివిధ రూపాల్లో సేవ కార్యక్రమాలు నిర్వహించారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి ప్రభావానికి ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్తలు, నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులకు సమావేశంలో సంతాపం ప్రకటించారు.

ఇదీ చదవండీ... సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం.. కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.