ETV Bharat / city

BJP 'Prajagraha Sabha': నేడు విజయవాడలో.. భాజపా 'ప్రజాగ్రహ సభ' - ఏపీ న్యూస్

BJP 'Prajagraha Sabha': రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నేడు విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహణకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం ఐదు గంటలవరకు ఈ సభ జరగనుంది. కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత ప్రకాష్‌ జావడేకర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.ఈ సభ ద్వారా వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక చర్యలపై శంఖారావం పూరిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.

'ప్రజాగ్రహ సభ
'ప్రజాగ్రహ సభ
author img

By

Published : Dec 27, 2021, 5:13 PM IST

Updated : Dec 28, 2021, 5:34 AM IST

BJP 'Prajagraha Sabha': విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహణకు భాజపా అన్ని ఏర్పాట్లు చేసింది. పార్టీ జాతీయ నాయకుడు ప్రకాశ్‌ జావడేకర్‌ పాల్గొనే ఈ సభ నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. వైకాపా పాలనను 10 అంశాల ద్వారా ఎండగట్టేలా నేతల ప్రసంగాలు ఉంటాయని భాజపా వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, తనఖా, అప్పులు, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగుల అవస్థలు, గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, విద్యుత్తు బిల్లుల మోత, కేంద్ర నిధుల వినియోగం, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, కక్షలు-కార్పణ్యాలు, ప్రభుత్వ సొమ్ముతో వైకాపా నేతలు అనుసరిస్తున్న వైఖరి, తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం, మతమార్పిళ్లు, ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యంపై నేతలు ప్రసంగించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, కార్యదర్శి సత్యకుమార్‌, రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, జీవీఎల్‌, టీజీ వెంకటేశ్‌ ఇతర నేతలు కలిపి సుమారు 20 మంది ప్రసంగిస్తారు. 2024లో జరిగే ఎన్నికలలో విజయం సాధించేందుకు నాంది పలికేలా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వేదికను పరిశీలించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

ఇదీ చదవండి

CM Jagan Review On Omicron Variant: సీఎం జగన్ సమీక్ష.. కొత్త ఏడాది వేడుకలపై కీలక నిర్ణయం!

Last Updated : Dec 28, 2021, 5:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.