ETV Bharat / city

Sunil Deodhar: "వైకాపా హిందువుల మనోభావాలను... తెబ్బతీసేలా వ్యవహరిస్తోంది" - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Sunil Deodhar: వైకాపా ప్రభుత్వం మత సంతుస్టికరణ ఆలోచనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పయనిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్‌ మండిపడ్డారు. హిందువులు, హిందూ పండుగలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నా అధికార పార్టీ కళ్లప్పగించి చూస్తోందని విమర్శించారు.

BJP national secretary
భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్‌
author img

By

Published : Apr 26, 2022, 1:14 PM IST

Sunil Deodhar: వైకాపా ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పయనిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్‌ ఆరోపించారు. నెల్లూరులో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తితిదే కళ్యాణమండపం నుంచి ప్రారంభమై.. స్టోన్ హౌస్ పేట వరకు పోలీసు అనుమతిపై జరుగుతున్న యాత్ర సమయంలో మద్రాస్ బస్టాండ్ సమీపంలో మతఛాందసవాదులు ఒక్కసారిగా రాళ్లు, మద్యం సీసాలు, ఇతర వస్తువులతో దాడి చేయడాన్ని ఖండించారు. హనుమాన్ విగ్రహంపై కూడా దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను భాజపా చూస్తూ ఉరుకోదని వైకాపా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందువులు, హిందూ పండుగలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నా.. అధికార పార్టీ కళ్లప్పగించి చూస్తోందని విమర్శించారు.

ఇదీ చదవండి: వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.