BJP Leaders on AP New Cabinet: అవినీతిలో కూరుకున్న వారిని కొత్త కేబినెట్‌లోకి తీసుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. జగన్ కేబినెట్‌లో మంత్రులకు పవర్ ఉందా? జగన్.. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు. టీడీఆర్ కుంభకోణంలో ఉన్న కారుమూరికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంవల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని అన్నారు.
వైకాపా పతన దిశగా వెళ్తోంది : రాష్ట్రంలో వైకాపా పతన దిశగా వెళ్తోందనడానికి తాజా పరిణామాలే నిదర్శనమని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంత్రివర్గ ఏర్పాటులో ప్రభుత్వం పాటించిన మార్గదర్శకాలు ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. తొలగించిన వారిని ఏ ప్రాతిపదికగా తీసేశారనే ప్రశ్నకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.
వైకాపాలోని అసంతృప్తులను చల్లార్చేందుకు ముఖ్యమంత్రి.. ఓ 15 రోజుల పాటు ఓదార్పు యాత్ర చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందన్నారు. అయితే అంతసమయం సీఎంకు ఉన్నట్లు లేదని.. తామే భాజపా తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికై మంత్రివర్గంలో పనిచేసిన వారి వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు వైకాపా నేతలే విమర్శిస్తున్నారని.. ఆయన్ను ముఖ్యమంత్రి ఆ తరహాలో ప్రోత్సహిస్తుండడం సరికాదన్నారు.
ఇదీచదవండి: