రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు భాజపా ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలపై ప్రకటన విడుదల చేయాలని కోరింది. అలాగే ఈ ఎన్నికల సందర్భంగా అనేక దాడులు, దౌర్జన్యాలు జరిగాయని లేఖలో ప్రస్తావించింది. వెంటనే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వాలని కోరింది.
ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా జరిపేలా చూడాలని పేర్కొంది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ నేతలు... రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా భాజపా సిద్ధంగా ఉందన్నారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి.. ప్రశాంత వాతావణంలో ఎన్నికలు జరగాలన్నారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్ నిబంధనలను పాటించేలా ఓటింగ్ ప్రక్రియను చేపట్టాలని తెలిపారు.
ఇదీ చదవండి
కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలి: చంద్రబాబు