ముఖ్యమంత్రి జగన్ బెయిల్పై తిరుగుతున్నారని.. ఏ క్షణమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ ధియోదర్ అన్నారు. తిరుపతిలో కాపు సంక్షేమ సేన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని.. మాట్లాడారు. బెయిల్పై ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతున్నారని.. అలాంటి వ్యక్తి నాయకత్వంలో రౌడీ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. స్టేలపై బతుకుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో స్టేలు తొలగిపోతాయని.. ఆయన జైలుకు వెళ్తారన్నారు. సమావేశంలో భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నాయకుడు హరిప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని భాజపా విమర్శించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు పాకాల సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జగన్ ఎన్నికల సంఘంగా మారిందని ఆరోపించారు. రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకోకుండానే పరిషత్ ఎన్నికల తేదీలను ప్రకటించటం సరైంది కాదని మండిపడ్డారు. గతంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అధికార పార్టీ అనేక అరాచకాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని అన్ని పార్టీల నుంచి డిమాండ్ వస్తుంటే కమిషనర్.. రాత్రికి రాత్రి నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నీలం సాహ్ని కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముడు రోజుల ముందు నుంచి పరిషత్ ఎన్నికల తేదీలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. ఆ తేదీలనే ప్రకటించటం ద్వారా కమిషన్ పారదర్శకత ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. ఎన్నికలకు నాలుగు వారాల కోడ్ అమలు చేయాలని 2020లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని... దాన్ని ఎన్నికల సంఘం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించకుండా ఎన్నికల తేదీల ప్రకటన ద్వారా ఎన్నికల వ్యవస్థను కమిషనర్ అవమానించారని విమర్శించారు.
ఇదీ చదవండి: