పురపాలక ఎన్నికలకు గతంలో ఇచ్చిన పాత నోటిఫికేషన్ను రద్దు చేసి తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. రాష్ట్రంలో జరుగుతోన్న ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యస్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని భాజపా నేతలు ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబుకు ఫిర్యాదు చేశారు.
దాడులు అరికట్టండి:
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్టు నేతలు తెలిపారు. దీని వల్ల అనేక మంది పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో భాజపా అభ్యర్థిపై అధికారపార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. భాజపా నేతలపై దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరినట్టు తెలిపారు.
ఇదీ చదవండి: